Header Banner

వైకాపా నేత కాకాణికి హైకోర్టు షాక్! క్వార్జ్ అక్రమ తవ్వకాల కేసు... అరెస్ట్‌కు గ్రీన్ సిగ్నల్!

  Thu Apr 10, 2025 07:23        Politics

క్వార్జ్ ఖనిజం అక్రమ తవ్వకాల కేసులో వైకాపా నేత, మాజీమంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డికి హైకోర్టు షాక్ ఇచ్చింది. అరెస్టు నుంచి రక్షణ కల్పించాలని కాకాణి చేసిన అభ్యర్ధనను న్యాయస్థానం తోసిపుచ్చింది. ఇదే కేసులో ముందస్తు బెయిలు కోసం దాఖలు చేసిన పిటిషన్ హైకోర్టులో పెండింగ్లో ఉందన్న కారణంతో కాకాణిపై తొందరపాటు చర్యలు తీసుకోకుండా పోలీసులను నిలువరించడం సమర్థనీయం కాదని స్పష్టంచేసింది. రికార్డులను పరిశీలిస్తే కాకాణి పాత్ర ఉన్నట్లు ప్రాథమికంగా స్పష్టమవుతోందని తేల్చిచెప్పింది. 'దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది. వాస్తవాలేమిటి అనేదానిపై స్పష్టత లేదు. పూర్తిస్థాయి ఆధారాలు సైతం మా ముందు లేవు' అని న్యాయస్థానం పేర్కొంది. ఈ నేపథ్యంలో కాకాణి గోవర్ధన్రెడ్డి అరెస్ట్ విషయంలో తొందరపాటు చర్యలు తీసుకోవద్దని ఆదేశాలు జారీచేయడం సరికాదని అభిప్రాయపడింది. ఎఫ్ఎఆర్, ఇతర వివరాలను పరిగణనలోకి తీసుకుంటే..ఈ కేసులో పోలీసులు లోతైన దర్యాప్తు జరపాల్సిన అవసరం ఉందని పేర్కొంది. కాగ్నిజబుల్ నేరాల్లో పోలీసుల దర్యాప్తునకు న్యాయస్థానాలు అవరోధం కలిగించడానికి వీల్లేదని పేర్కొంది. దర్యాప్తు దశలోనే క్రిమినల్ ప్రొసీడింగ్స్ను కట్టడి చేయలేమంది. కాకాణిని అరెస్ట్ చేయవద్దంటూ బ్లాంకెట్ ఉత్తర్వులు ఇవ్వడమంటే.. దర్యాప్తు సంస్థకు ఉన్న అధికారాన్ని హరించినట్లే అవుతుందని అభిప్రాయపడింది.


ఇది కూడా చదవండి: NRI లకు శుభవార్త తెలిపిన సీఎం చంద్రబాబు! పూర్తి వివరాలు అందరూ తప్పక తెలుసుకోవాల్సిందే! GO కూడా విడుదల!


అరెస్టును నిలువరించాలని కోరుతూ పిటిషనర్ కోరినట్లు ఉత్తర్వులు ఇవ్వలేమంది. ఈ నేపథ్యంలో తనపై నమోదు చేసిన కేసులో అరెస్టుతోపాటు పోలీసులు తీసుకునే తదుపరి చర్యలను నిలువరించాలంటూ కాకాణి దాఖలు చేసిన అనుబంధ పిటిషన్ ను కొట్టేస్తున్నట్లు ప్రకటించింది. న్యాయమూర్తి జస్టిస్ టి.మల్లికార్జునరావు బుధవారం ఈమేరకు నిర్ణయాన్ని ప్రకటించారు. వైకాపా హయాంలో శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వరదాపురం సమీపంలో ప్రభుత్వ భూమిని ఆక్రమించి టన్నుల కొద్ది క్వార్జ్ ఖనిజాన్ని తవ్వి తరలించారంటూ మైనింగ్ అధికారి బాలాజీనాయక్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఫిబ్రవరి 16న పొదలకూరు పోలీసులు కేసు నమోదు చేశారు. అనుమతులు లేకుండా పేలుడు పదార్థాలు వినియోగించారని మైనింగ్ అధికారి పేర్కొన్నారు.. ప్రశ్నించిన గిరిజనులను బెదిరించారన్నారన్నారు. ఈ కేసులో నాలుగో నిందితుడిగా ఉన్న కాకాణి గోవర్ధన్రెడ్డి.. ముందస్తు బెయిలు పిటిషన్ తో పాటు తనపై కేసును కొట్టేయాలంటూ రెండు వేర్వేరు పిటిషన్లు వేశారు. ముందస్తు బెయిలు పిటిషన్ విచారణ అర్హతపై ఇటీవల వాదనలు ముగియడంతో హైకోర్టు తీర్పును రిజర్వు చేసింది. బుధవారం న్యాయమూర్తి నిర్ణయాన్ని ప్రకటిస్తూ అనుబంధ పిటిషన్ ను కొట్టేశారు.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

మాజీ మంత్రి హైకోర్టులో షాక్.. ఇక అరెస్టేనా?

 

జగన్ చేసిన వ్యాఖ్యలు కలకలం - క్షమాపణ చెప్పాలని డిమాండ్! పోలీసు సంఘం స్ట్రాంగ్ కౌంటర్!

 

రెండు తెలుగు రాష్ట్రాల‌కు పండగ లాంటి వార్త! గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవేకు గ్రీన్ సిగ్న‌ల్‌!

 

ఏపీ ప్రజలకు మరో శుభవార్త.. అమరావతిలో ఇ-13, ఇ-15 కీలక రహదారుల విస్తరణ! అక్కడో ఫ్లైఓవర్ - ఆ ప్రాంతం వారికి పండగే!

 

వల్లభనేని వంశీకి మరో ఎదురుదెబ్బ.. మళ్లీ రిమాండ్ పొడిగింపు!

 

సినీ నటుడు సప్తగిరి ఇంట్లో విషాదం! ఈరోజు తిరుపతిలో అంత్యక్రియలు..

 

ఎయిర్‌పోర్ట్ పనులపై రామ్మోహన్ ఆగ్రహం.. కీలక ఆదేశాలు జారీ! ఎయిర్‌పోర్ట్ పూర్తికి డెడ్లైన్ ఫిక్స్!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #KakaniGovardhanReddy #YSRCP #HighCourtShock #QuartzMiningCase